Skip to main content

ఎన్‌డీఏలో ప్రవేశం కోసం మొదటి దశలో నిర్వహించే రాత పరీక్ష వివరాలను తెలపండి?

Question
ఎన్‌డీఏలో ప్రవేశం కోసం మొదటి దశలో నిర్వహించే రాత పరీక్ష వివరాలను తెలపండి?
మొదటి దశలో నిర్వహించే రాత పరీక్ష.. పేపర్‌-1(మ్యాథమెటిక్స్‌), పేపర్‌-2(ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌) అనే రెండు దశల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇంగ్లిష్‌ మాధ్యమంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి మూడు తప్పులకు ఒక మార్కును.. పొందిన మార్కుల్లోంచి తగ్గిస్తారు. దూరదృష్టి, అకెడమిక్స్‌పై పట్టు, కాంపిటీటివ్‌ ఓరియెంటేషన్‌ ఉంటే ఇందులో విజయం సాధ్యమే.
పేపర్‌-1 మ్యాథమెటిక్స్‌: మార్కులు: 300 వ్యవధి: రెండున్నర గంటలు.
ప్రధానంగా అభ్యర్థిలోని మ్యాథ్స్‌ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్‌ బేస్డ్‌గానే ఉంటాయి. పేపర్‌-1 మ్యాథమెటిక్స్‌ పేపర్లలోని ప్రశ్నలన్నిటినీ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం సిలబస్‌ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఆల్జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌, ట్రెగ్నోమెట్రీ, అనలిటికల్‌ జామెట్రీ ఆఫ్‌ టు అండ్‌ త్రీ డెమైన్షన్స్‌, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్‌, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్‌ అండ్‌ డిఫరెన్షియల్‌ ఈక్వేషన్స్‌, వెక్టార్‌ అల్జీబ్రా, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ అంశాల్ని సిలబస్‌లో పొందుపరిచారు.మ్యాథమెటిక్స్‌లోని పలు సిద్ధాంతాలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

పేపర్‌-2 జనరల్‌ ఎబిలిటీ: మార్కులు: 600 కాలవ్యవధి: రెండున్నర గంటలు.
ఈ పేపర్‌ను ఇంగ్లిష్‌ (200 మార్కులు), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌(400 మార్కులు) రెండు విభాగాలుగా విభజించారు.
ఇంగ్లిష్‌: ఇంగ్లిష్‌ భాషపై కనీస పరిజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలే అడుగుతారు. ఈ క్రమంలో ఎక్కువగా యూసేజ్‌, వొక్యాబులరీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతిరోజు కొత్తగా 15 నుంచి 20 పదాలు నేర్చుకోవడం, షార్ట్‌ స్టోరీస్‌ చదవడం, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, టెన్సెస్‌ అభ్యసనం, చిన్నపాటి ప్యాసేజ్‌లను చదివి వాటిలో ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉన్న వాటిని గుర్తించడం ద్వారా ఈ విభాగంలో రాణించవచ్చు.

జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ : ఇందులో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్‌, చరిత్ర- భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరంట్‌ అఫైర్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎక్కువగా ఫిజిక్స్‌(దాదాపు 25శాతం) ప్రశ్నలే ఉంటున్నాయి. చరిత్ర, జాగ్రఫీలకు 20 శాతం చొప్పున, కెమిస్ట్రీ 15 శాతం, జనరల్‌ సైన్స్‌, కరంట్‌ అఫైర్స్‌కు 10 శాతం చొప్పున ప్రాధాన్యం ఇస్తున్నారు. కరెంట్‌ అఫైర్స్‌ కోసం పరీక్ష జరిగే తేదీకి ముందు ఆరు నెలల వ్యవధిలో జరిగిన సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి.

Photo Stories