Skip to main content

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశానికి అర్హతలేమిటి?

Question
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ(ఎన్‌డీఏ)లో ప్రవేశానికి అర్హతలేమిటి?
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ.. దేశ భద్రతను అనుక్షణం కాపాడే త్రివిధ దళాల(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌)కు చురుకైన సైనికులను అందించే ఉద్దేశంతో... ఆరు దశాబ్దాల క్రితం మహారాష్టల్రోని పుణేలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రై నింగ్‌ అకాడెమీ. ఇందులో  ప్రవేశానికి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ప్రతి ఏటా రెండుసార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీ అండ్‌ నావల్‌ అకాడెమీ(ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తోంది. దేశంలో ఇంటర్మీడియెట్‌ అర్హతతో నిర్వహించే చదువు, శిక్షణ, ఉద్యోగం మూడింటి సమ్మిళిత ఏకైక పరీక్ష ఇదే. ఇందులో ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. అర్హత: ఆర్మీ వింగ్‌- ఇంటర్మీడియెట్‌ లేదా 10+2/తత్సమానం. ఎయిర్‌ఫోర్స్‌-నావల్‌ వింగ్స్‌ - మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ఆప్షన్స్‌తో  ఇంటర్మీడియెట్‌, లేదా 10+2/తత్సమానం. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. అయితే నోటిఫికేషన్‌లో పేర్కొన్న తేదీనాటికి సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి. వయసు: 161/2-19 సంవత్సరాలు. సంబంధిత నోటిఫికేషన్‌ ప్రతి ఏటా రెండుసార్లు(ఏప్రిల్‌/మే, అక్టోబర్‌/నవంబర్‌లలో) వెలువడుతుంది. పరీక్ష: ఏప్రిల్‌/మే, సెప్టెంబర్‌/అక్టోబర్‌లలో ఉంటుంది.

Photo Stories