జనరల్ నాలెడ్జ్‌ను ఏవిధంగా ప్రిపేర్ కావాలి?
Question
జనరల్ నాలెడ్జ్‌ను ఏవిధంగా ప్రిపేర్ కావాలి?
ఈ విభాగంలోని కరెంట్ అఫైర్స్ కోసం.. పరీక్ష తేదీకి సరిగ్గా ఏడాది ముందు వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు తెలుసుకోవాలి. విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్.. లాంటి దేశాల్లో జరిగిన ఆసక్తికర పరిణామాలు గుర్తుంచుకోవాలి. భారత్‌కు వివిధ దేశాలతో ఈ ఏడాది కాలంలో జరిగిన ఒప్పందాలు; ప్రధాని, రాష్టప్రతి, మంత్రుల విదేశీ పర్యటనలు మననం చేసుకోవాలి. సదస్సులు, సమావేశాలు, అవార్డులు, భారత్‌లో పర్యటించిన ప్రముఖులు, క్రీడలు-విజేతలు, పుస్తకాలు-రచయితలు, దేశంలో ఈ ఏడాదిలో సంభవించిన వివిధ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలు.. వీటన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష కాబట్టి అడవులు, వన్యప్రాణులు, సంరక్షణా కేంద్రాలు, వాతావరణ మార్పులు, ఈ అంశాల్లో తాజా పరిణామాలు అవలోకనం చేసుకుంటే ప్రయోజనం.