జనరల్ నాలెడ్జ్ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
Question
జనరల్ నాలెడ్జ్ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
జనరల్ నాలెడ్జ్‌లో వర్తమాన వ్యవహారాలతోపాటు రోజువారీ సంఘటనలు, పరిశీలనల నుంచి ప్రశ్నలడుగుతారు. వీటికి సమాధానాలు రాయడానికి ఎందులోనూ ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సైన్స్ అంశాలపై ప్రశ్నలొస్తాయి. వీటితోపాటు రాజనీతి శాస్త్రం, రాజకీయ విధానం, భారత రాజ్యాంగం, భారత దేశ చరిత్ర, భూగోళశాస్ర్తాల్లో అభ్యర్థి అవగాహన తెలుసుకునేలా ప్రాథమిక స్థాయి ప్రశ్నలడుగుతారు.