ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరాలనుకుంటున్నాను. దీనికి అర్హత ఏంటి? పరీక్ష విధానం తెలుపగలరు? ప్రకటన ఎప్పుడు వెలువడుతుంది?
Question

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్‌సీ ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ప్రకటన ఫిబ్రవరిలో వెలువడుతుంది. డిగ్రీ స్థాయిలో... యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, జియూలజీల్లో కనీసం ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ కోర్సుల్లో డిగ్రీ, లేదా ఇంజినీరింగ్ చేసినవారూ అర్హులే. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు నాలుగుసార్లు మాత్రమే పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఓబీసీ విద్యార్థులు ఏడుసార్లు ఈ పరీక్ష రాయొచ్చు.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. పరీక్ష వ్యాసరూప విధానంలో ఉంటుంది. రెండు కంపల్సరీతోపాటు రెండు ఆప్షనల్ పేపర్లను పరీక్షకోసం ఎన్నుకోవాలి. పాతప్రశ్నపత్రాలను తిరగేస్తే ప్రశ్నల సరళి తెలుస్తుంది. రాత పరీక్షకు 1400 మార్కులు. ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు. పూర్తి వివరాలకోసం www.upsc.gov.in చూడొచ్చు.