Skip to main content

త్రివిధ దళాల్లో ప్రారంభంలోనే ‘కమిషన్డ్‌ ర్యాంక్‌’ హోదాలో ప్రవేశం ఎలా?

Question
త్రివిధ దళాల్లో ప్రారంభంలోనే ‘కమిషన్డ్‌ ర్యాంక్‌’ హోదాలో ప్రవేశం ఎలా?
త్రివిధ దళాల్లో ప్రారంభంలోనే ‘కమిషన్డ్‌ ర్యాంక్‌’లో అడుగుపెట్టేందు సరైన అవకాశం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌). ఈ పరీక్షను ప్రతి ఏడాది యూపీఎస్సీ రెండుసార్లు.. ఫిబ్రవరి, ఆగస్టు నెలలో నిర్వహిస్తుంది.  సంబంధిత నోటిఫికేషన్‌ మే, అక్టోబర్‌లలో వెలువడుతుంది. సీడీఎస్‌ ద్వారా మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవల్‌, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీల్లోకి నోటిఫికేషన్‌లో నిర్దేశించిన విధంగా అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందులో ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ మహిళల షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌కు మహిళ అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

Photo Stories