Skip to main content

సీడీఎస్‌- మ్యాథ్స్‌ పేపర్‌లో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయా?

Question
సీడీఎస్‌- మ్యాథ్స్‌ పేపర్‌లో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయా?
వాస్తవానికి సీడీఎస్‌ మ్యాథ్స్‌ పరీక్షలో ఈ పేపర్‌ను ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌గా పేర్కొన్నారు. అయినప్పటికీ.. ఇందులో పదోతరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్‌ అంశాలను ప్రశ్నలుగా అడుగుతారు. అర్థమెటిక్‌కు సంబంధించి ఇంటిజర్స్‌, నంబర్‌ సిస్టమ్‌, రియల్‌ నంబర్స్‌, దూరం-కాలం; కాలం- పని; శాతాలు; వడ్డీ రేట్లు; లాభ నష్టాలు వంటి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. ఇక ఆల్జీబ్రాలో రిమైండర్‌ థీరమ్‌, హెచ్‌సీఎఫ్‌, ఎల్‌సీఎం; పాలినామియల్‌ థీరమ్స్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, రూట్స్‌ అండ్‌ కో-ఎఫి షియెంట్స్‌ తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. అదేవిధంగా పదో తరగతి స్థాయిలోని ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ సంబంధ ఫార్ములాలు, సిద్ధాంతాలు, భావనలు తెలుసుకోవాలి.

Photo Stories