Skip to main content

సీడీఎస్‌-జనరల్‌ నాలెడ్జ్‌ కోసం ఏయే అంశాలపై దృష్టి సారించాలి?

Question
సీడీఎస్‌-జనరల్‌ నాలెడ్జ్‌ కోసం ఏయే అంశాలపై దృష్టి సారించాలి?
భారత చరిత్ర నుంచి నేటి సమకాలీన అంశాల వరకు అన్ని రంగాల్లో (సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్‌, పాలిటీ) ప్రాథమిక పరిజ్ఞానం తెలుసుకునే విధంగా ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా చరిత్రకు సంబంధించి భారత స్వాంతంత్రోద్యమంపై ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదే విధంగా రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన సవరణలు -వాటి ఉద్దేశా లు; రాజ్యాంగ స్వరూపం-లక్షణాలు; సమకాలీన మార్పులపై దృష్టి సారించాలి. జాగ్రఫీలో.. ప్రాథమికంగా భారత భౌగోళిక సరిహద్దులు, పర్వతాలు- అగాథాలు; నదులు- పరీవాహక ప్రాంతాలు- ప్రాజెక్టులు - డ్యాంలు; సహజ వనరులు వంటి అంశాలపై ప్రిపరేషన్‌ లాభిస్తుంది. ఇక సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఎక్కువగా సమకాలీన అంశాలపైనే ప్రశ్నలడిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అభ్యర్థులు ముఖ్యంగా రక్షణ శాఖకు సంబంధించిన తాజా పరిణామాలు (క్షిపణి పరీక్షలు- ప్రయోగించిన తేదీలు- వాటి పరిధులు, రక్షణ శాఖలో నియామకాలు, భారత్‌ యుద్ధా లు-ప్రత్యర్థులు-సమయం-విజేతలు తదితర వివరాలు) తెలుసుకోవడం మంచిది.

Photo Stories