Skip to main content

బీఎస్సీ(మైక్రోబయాలజీ) చేసి, ప్రస్తుతం కెమికల్‌ పరిశ్రమలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాను. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ) ద్వారా ఆర్మీలో చేరాలన్నది...

Question
బీఎస్సీ(మైక్రోబయాలజీ) చేసి, ప్రస్తుతం కెమికల్‌ పరిశ్రమలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాను. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ) ద్వారా ఆర్మీలో చేరాలన్నది నా ఆకాంక్ష. ఇపుడు అవకాశం ఉంటుందా?
భారత సైనిక దళంలో కమిషన్డ్‌ ఆఫీసర్స్‌గా నియామకం చేపట్టడానికి సీడీఎస్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇది ప్రవేశ పరీక్ష మాత్రమే. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) ఏడాదిలో రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తోంది. సాధారణంగా పరీక్షను ఫిబ్రవరి, సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల్ని వారి ఆప్షనల్స్‌ మేరకు సైనికదళం, నావికా దళం, వాయుసేనలో నియామకాలు చేపట్టడానికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూను నిర్వహిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ(ఐఎంఏ), డెహ్రాడూన్‌; నావల్‌ అకాడెమీ, గోవా; ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ, హైదరాబాద్‌; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ, చెన్నై కేంద్రాలకు శిక్షణ నిమిత్తం పంపిస్తారు.

సీడీఎస్‌ పరీక్షకు సంబంధించిన ప్రకటన మార్చి, ఆగస్టులలో వస్తుంది.

అర్హత :
ఎ) ఇండియన్‌ మిలటరీ అకాడెమీ - ఏదైనా గ్రాడ్యుయేషన్‌. 19-24 ఏళ్ల మధ్య ఉండాలి.

బి) నావల్‌ అకాడెమీ - ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ ప్రధానాంశాలుగా గ్రాడ్యుయేషన్‌. ఇంజినీరింగ్‌ అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 19-22 ఏళ్ల మధ్య ఉండాలి.

సి) ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ - ిఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ ప్రధానాంశాలుగా గ్రాడ్యుయేషన్‌ ఉండాలి. ఇంజినీరింగ్‌ అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 19-23 ఏళ్ల మధ్య ఉండాలి.

డి) ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ - ఏదైనా గ్రాడ్యుయేషన్‌. 19-25 ఏళ్ల మధ్య ఉండాలి.
పైన తెలిపిన వివరాల ప్రకారం విద్యార్హతలు, వయోపరిమితి ఉన్నట్టయితే దరఖాస్తు చేయడానికి మీరు అర్హులే.

Photo Stories