Skip to main content

సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?

Question
సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అంతకంటే కఠినమైన ప్రక్రియను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ రూపంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌; థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌; వర్డ్‌ అసోసియే షన్‌ టెస్ట్‌; గ్రూప్‌ టెస్ట్‌ పేరిట అభ్యర్థుల్లోని మానసిక సామర్థ్యాన్ని, ధైర్య సాహసాలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియ అంతా దాదాపు ఐదారురోజులపాటు సాగుతుంది. ఈ ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కోవాల్సిన అంశాలు:

సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌: నిర్ణీత సంఘటనలకు సంబంధించి 60 ప్రశ్నలు అడుగుతారు. కేవలం 30 నిమిషాల్లో వాటికి సరైన పరిష్కారం కనుక్కోవాలి
థిమాటిక్‌ అప్రిసియేషన్‌ టెస్ట్‌: అభ్యర్థికి 12 దృశ్యాలను చూపిస్తారు. వాటికి సరితూగే విధంగా 36 నిమిషాల్లో ఒక కథ రూపొందించాలి.

వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌: ఇందులో అభ్యర్థికి మొత్తం 60 పదాలిస్తారు. ప్రతి పదాన్ని ఆధారం చేసుకుంటూ 60 అర్థవంతమైన వాక్యాలు రూపొందించాల్సి ఉంటుంది. ఒక్కో పదానికి కేటాయించే సమయం కేవలం పదిహేను సెకన్లు.

గ్రూప్‌ టెస్ట్‌: ఎనిమిది నుంచి పదిమంది అభ్యర్థుల మధ్యలో జరిగే గ్రూప్‌ టెస్ట్‌లో నిర్ణీత సంఘటనలకు సంబంధించి ప్లానింగ్‌, డిస్కషన్‌, డిబేట్స్‌ ఉంటాయి.

Photo Stories