Skip to main content

సీడీఎస్‌-ఇంగ్లిష్‌ పేపర్‌లో ఎటువంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి?

Question
సీడీఎస్‌-ఇంగ్లిష్‌ పేపర్‌లో ఎటువంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి?
మిలటరీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఓటీఏలలో ఎంపిక కోసం నిర్వహించే రాతపరీక్షలో ఇంగ్లిష్‌ సబ్జెక్ట్‌ కీలకం. అభ్యర్థుల్లో ఇంగ్లిష్‌ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే రీతిలోనే ప్రశ్నలుంటాయి. ఈ క్రమంలో ముఖ్యంగా కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, యాంటానిమ్స్‌, సినానిమ్స్‌, వర్డ్‌ యూసేజ్‌ వంటి వాటిపై దృష్టిసారించడం మేలు. వీటితోపాటు యాక్టివ్‌, ప్యాసివ్‌ వాయిస్‌, టెన్సెస్‌, ప్యాసేజ్‌ రీడింగ్‌, వాటిలోంచి కీలకాంశాలను పసిగట్టే నేర్పు ఉంటే ఈ విభాగంలో రాణించడం తేలికే. దీనికోసం వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ, ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ వంటి పుస్తకాలు చదవడం ఉపకరిస్తుంది.

Photo Stories