Skip to main content

అకాడెమీల్లో శిక్షణ తర్వాత కెరీర్‌ ఏవిధంగా ఉంటుంది?

Question
అకాడెమీల్లో శిక్షణ తర్వాత కెరీర్‌ ఏవిధంగా ఉంటుంది?
రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తే త్రివిధ దళాల్లో అవకాశం చేజిక్కించుకున్నట్లే.  దీనికి ముందుగా ఆ దళాలకు ఉపయోగపడే విధంగా కఠోర శిక్షణనిస్తారు. ఇండియన్‌ మిలటరీ అకాడెమీ(డెహ్రాడూన్‌)లో 18 నెలలు; నేవల్‌ అకాడెమీలో సుమారు 17 నెలలు; ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీలో 18 నెలలు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ప్రవేశించవచ్చు. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌-లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టినవారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు. ప్రారంభంలోనే Rs. 15,600 - 39,100 (గ్రేడ్‌పే Rs. 5400) జీతం, ఇతర అలవెన్సులు అందుకోవచ్చు. ఇక.. ఒక్కసారి కమిషన్డ్‌ హోదాలో త్రివిధ దళాల్లో అడుగుపెట్టారంటే.. ప్రతిభ, పోరాట పటిమ ప్రామాణికాలుగా పదోన్నతులు సొంతం చేసుకోవచ్చు. ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌ హోదాతో చేరిన వారు ఆరేళ్లకే మేజర్‌ స్థాయికి చేరుకోవచ్చు. అదేవిధంగా మిగతా రెండు విభాగాల్లో కూడా టైంస్కేల్‌ ప్రాతిపదికగా పదోన్నతులు పొందవచ్చు.

Photo Stories