Skip to main content

సీడీఎస్‌ ఎంపిక ఏవిధంగా ఉంటుంది?

Question
సీడీఎస్‌ ఎంపిక ఏవిధంగా ఉంటుంది?
త్రివిధ దళాలకు చెందిన ట్రైనింగ్‌ అకాడెమీల్లో శిక్షణ కోసం నిర్వహించే సీడీఎస్‌ పరీక్షలో మూడు దశలు ఉంటాయి. అవి.. రాత పరీక్ష, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూ, పర్సనల్‌ ఇంటర్వ్యూ. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు క్రమంగా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఇంటర్వ్యూ, పర్సనల్‌ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన వారికి ముందుగా త్రివిధ దళాలకు చెందిన ట్రైనింగ్‌ అకాడెమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ కోసం ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్‌), నేవీ కోసం ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ(కేరళ), ఎయిర్‌ ఫోర్స్‌ కోసం ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీకి చెందిన వివిధ ప్రాంతాల్లో., పురుషులు, మహిళల షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కోసం ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (చెన్నై)లలో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఆయా దళాల్లో కమిషన్డ్‌ ర్యాంక్‌ అధికారి హోదాలో నియామకం ఖరారు చేస్తారు.

Photo Stories