Skip to main content

సీడీఎస్‌ ఎగ్జామ్‌కు కావల్సిన అర్హతలు?

Question
సీడీఎస్‌ ఎగ్జామ్‌కు కావల్సిన అర్హతలు?
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరవ్వాలంటే కనీస అర్హత బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఒక్క నేవల్‌ అకాడెమీకి మాత్రం ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. నిర్దేశిత వయోపరిమితి ఉంటుంది. ఆయా కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్నవారు, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ పూరె్తై.. అకాడెమీల్లో అడుగు పెట్టే సమయానికి సర్టిఫికెట్లను అందజేయాలి. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలోని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ మహిళల నాన్‌ టెక్నికల్‌ కోర్సు మినహా మిగతా విభాగాలకు.. కేవలం అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎస్‌ఎస్‌సీ మహిళల నాన్‌ టెక్నికల్‌ కోర్సుకు నిర్దేశించిన వయోపరిమితి కలిగిన అవివాహిత మహిళలు మాత్రమే అర్హులు.
వెబ్‌సైట్‌: www.upsc.gov.in

Photo Stories