Skip to main content

స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్ట్రాటజీని వివరించండి?

Question
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్ట్రాటజీని వివరించండి?
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లోని ఆయా అంశాలకు సంబంధించి సాంకేతిక నామాలు, యూనిట్లు- ప్రమాణాలు, బేసిక్‌ ప్రిన్సిపుల్స్‌ వంటివి నోటి మాటగా చెప్పే నైపుణ్యం ఉండాల్సిందే. నెగెటివ్‌ మార్కింగ్‌ (ప్రతి నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు) ఉంటుంది. కాబట్టి పరీక్ష సమయంలో తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా పదుల సంఖ్యలోనే ఉండే ఖాళీలను చేజిక్కించుకోవాలంటే ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎంసెట్‌, ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈ వంటి పోటీ పరీక్షలకు హాజరైనవారు సులువుగానే ఈ రాత పరీక్షలో నెగ్గొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇప్పట్నుంచి పరీక్షకు మూడున్నర నెలల వ్యవధి ఉంది కాబట్టి.. రోజకు కనీసం 8 గంటల ప్రిపరేషన్‌తో విజయానికి చేరువకావచ్చు. ప్రిపరేషన్‌ క్రమంలో.. ఇంటర్మీడియెట్‌ స్థాయిలో ‘ఛాయిస్‌’ కింద వదిలేసిన అంశాలపై ముందుగా దృష్టి కేంద్రీకరించడం మంచిది. అకడెమిక్‌ పరీక్షల్లో లభించే ఛాయిస్‌ సౌలభ్యం కాంపిటీటివ్‌ పరీక్షల్లో లభించదు.. కాబట్టి అభ్యర్థులు ప్రతి అంశంపైనా పట్టు సాధించే దిశగా కృషి చేయాలి. ‘ఎలిమినేషన్‌’ ప్రాసెస్‌కు ఎంత దూరంగా ఉంటే విజయానికి అంత దగ్గరవుతారని గుర్తించాలి. ప్రిపరేషన్‌ సమయంలో స్టాండర్డ్‌ మెటీరియల్‌తోపాటు రివిజన్‌ సమయంలో ప్రీవియస్‌ క్వశ్చన్‌ పేపర్స్‌, మోడల్‌ టెస్ట్‌లను సాల్వ్‌ చేయడం ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది.

Photo Stories