Skip to main content

రాత పరీక్ష తర్వాత ఉండే ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?

Question
రాత పరీక్ష తర్వాత ఉండే ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 200. పలు బోర్డుల నేతృత్వంలో సాగే ఈ పర్సనాలిటీ టెస్ట్‌లలో సాధారణ అంశాలపైనా, బయోడేటా ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పర్సనాలిటీ టెస్ట్‌ ప్రధానంగా.. అభ్యర్థికున్న నాయకత్వ లక్షణాలు, ఆసక్తి, సమర్థత, ప్రత్యేకతలు, మానసిక పరిపక్వత స్థాయిని తెలుసుకునే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఈ లక్షణాలను సొంతం చేసుకునేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నించాలి. ఈ క్రమంలో అభ్యర్థులు తమ హాబీలు, ఇతర అలవాట్లు తెలియజేసే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సాధారణంగా ఇంటర్వ్యూల్లో హాబీలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. వాటికి సంబంధించిన ప్రశ్నలను అడగడం సహజం. కాబట్టి భేషజాలకు పోకుండా నిజంగా ఆసక్తి ఉన్న వాటినే తెలియజేయడం వల్ల ఇంటర్వ్యూ సమయంలో నిశ్చింతగా ఉండొచ్చు.

Photo Stories