Skip to main content

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డీలో విజయం సాధించేందుకు ప్రధానంగా ఏ అంశాలను అధ్యయనం చేయాలి?

- ఎన్.వికాస్, హైదరాబాద్.
Question
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డీలో విజయం సాధించేందుకు ప్రధానంగా ఏ అంశాలను అధ్యయనం చేయాలి?
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డీ సిలబస్‌లో మ్యాథమెటిక్స్; జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్; జనరల్ సైన్స్; కరెంట్ అఫైర్స్ అంశాలున్నాయి.

మ్యాథమెటిక్స్ :
మ్యాథమెటిక్స్ స్కోరింగ్ విభాగమని చెప్పొచ్చు. పదో తరగతి స్థాయిలో సమస్యలుంటాయి. ప్రాక్టీస్ ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు పొందొచ్చు.

వెయిటేజీ అంచనా..
సింప్లిఫికేషన్:7-10మార్కులు; డేటా ఇంటర్‌ప్రెటేషన్: 4-5 మార్కులు; ఆల్జీబ్రా:3-5; పర్సంటేజీలు: 2-3; నంబర్ సిస్టమ్: 2-3; యావరేజెస్: 1-2; రేషియో అండ్ ప్రపోర్షన్: 1-2; మిక్చర్ ప్రాబ్లమ్స్: 1-2; మెన్సురేషన్: 1-2; టైమ్ అండ్ వర్క్: 1-2; స్పీడ్, టైమ్, డిస్టెన్స్: 2-3; ఇంట్రెస్ట్: 1-2; ప్రాఫిట్ అండ్ లాస్: 2-3; నంబర్ సిరీస్: 1-2; జామెట్రీ: 1-2; ట్రిగనోమెట్రీ: 0-1; ప్రాబబిలిటీ: 0-1 మార్కులు.

రీజనింగ్
తార్కిక అవగాహనా స్థాయిని పరీక్షించేలా రీజనింగ్ ప్రశ్నలుంటాయి. వీటికి సరైన సమాధానాలు గుర్తించేందుకు ప్రత్యేక సూత్రాలు ఉండవు. మోడల్ ప్రశ్నల సాధన ద్వారా ఇందులో మంచి మార్కులు పొందొచ్చు. సునిశిత పరిశీల ద్వారా ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించొచ్చు.

వెయిటేజీ అంచనా...
అనాలజీ: 2-3 మార్కులు; సిరీస్: 3-5; కోడింగ్ అండ్ డీకోడింగ్: 1-3; పజిల్స్: 4-5; డెరైక్షన్ అండ్ డిస్టెన్స్: 0-1; బ్లడ్ రిలేషన్స్: 1; ఆల్ఫాబెట్ అండ్ వర్డ్ టెస్ట్: 0-1; వెన్‌డయాగ్రమ్: 2-3; మిస్సింగ్ నంబర్: 1-2; నాన్ వెర్బల్ రీజనింగ్: 1-2; క్లాసిఫికేషన్: 1-2; వెర్బల్ రీజనింగ్: 1-2 మార్కులు.

జనరల్ అవేర్‌నెస్- కరెంట్ అఫైర్స్ :
ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ ద్వారా జనరల్ అవేర్‌నెస్-కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. తక్కువ సమయంలోనే ఇందులోని ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించేందుకు అవకాశముంది. ఈ విభాగం నుంచి దాదాపు 25 ప్రశ్నలు వస్తాయి. ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ; క్రీడలు, సంస్కృతి, వ్యక్తులు, ఆర్థికరంగం, పాలిటీ, ఇతర ప్రాధాన్య సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి.

వెయిటేజీ అంచనా..
పాలిటీ-3 మార్కులు; జాగ్రఫీ: 4 మార్కులు; హిస్టరీ-4 మార్కులు; ఎకానమీ-4 మార్కులు; ప్రభుత్వ విధానాలు: 2 మార్కులు; స్టాటిక్ జనరల్ నాలెడ్జ్: 10 మార్కులు.
  • స్టాటిక్ జీకేలో కరెన్సీలు, రాజధానులు, జాతీయ పార్కులు, నదులు, డ్యాంలు, జలసంధులు, నదుల ఒడ్డున నగరాలు, ప్రధాన కార్యాలయాలు (జాతీయ, అంతర్జాతీయ సంస్థలు), సంస్కతి (సంప్రదాయ నత్యాలు, పండగలు తదితర), క్రీడలు (ముఖ్య టోర్నీలు-విజేతలు, రికార్డులు, పతకాల సంఖ్య, కప్‌లు, భవిష్యత్ క్రీడలకు వేదికలు తదితర).
  • కరెంట్ అఫైర్స్ కోసం పత్రికలు చదవడం ప్రధానం. ముఖ్యాంశాలను ప్రత్యేకంగా నోట్స్‌లో రాసుకొని, చదవాలి.

జనరల్ సైన్స్ :
గత ప్రశ్నపత్రాల పరిశీలన ద్వారా జనరల్ సైన్స్‌లో దృష్టిసారించాల్సిన ప్రధానంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ఈ విభాగం నుంచి కూడా దాదాపు 25 ప్రశ్నలు రావొచ్చు.

వెయిటేజీ అంచనా ..
ఎన్విరాన్‌మెంట్-2 మార్కులు, ఫిజిక్స్- 6 మార్కులు; కెమిస్ట్రీ-6 మార్కులు; బయాలజీ-2 మార్కులు.

Photo Stories