Skip to main content

ఎంపిక తర్వాత కెరీర్‌ ఏవిధంగా ఉంటుంది?

Question
ఎంపిక తర్వాత కెరీర్‌ ఏవిధంగా ఉంటుంది?
 రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండు దశల్లోనూ విజయం సాధించిన అభ్యర్థులకు నాలుగేళ్ల పాటు రైల్వే వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ అందిస్తారు. ఈ సమయంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మెర్సా(రాంచీ) నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ సొంతమవుతుంది. ఈ దిశగా థియరిటికల్‌, ప్రాక్టికల్‌ శిక్షణ కూడా రైల్వే వర్క్‌షాప్‌లలో లభిస్తుంది. ఈ శిక్షణ సమయంలో అభ్యర్థి సాధించిన పరిజ్ఞానాన్ని నిరంతరం పరీక్షిస్తారు. ఈ క్రమంలో నాలుగేళ్ల కాలంలో ఎనిమిది సెమిస్టర్‌లలో పరీక్షలు రాయాలి. అన్ని సెమిస్టర్లలోనూ సగటున 40 శాతం, నిర్ణీత ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డెరైక్టర్‌ ఇచ్చే పెర్ఫార్మెన్స్‌ రిపోర్ట్‌లో 60 శాతం మార్కులు సొంతం చేసుకోవాలి. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి రైల్వేలో క్లాస్‌-1 హోదాలో మెకానికల్‌ ఇంజనీర్‌గా ప్రొబేషనరీ అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది. ఈ ప్రొబేషన్‌ పిరియడ్‌ 18 నెలలు. అంతేకాక ప్రతి సెమిస్టర్‌ మధ్యలో ఆన్‌- జాబ్‌ ట్రైనింగ్‌ క్లాస్‌లను కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు సొంతంగా ప్రాజెక్ట్‌ వర్క్‌ చేపట్టే అవకాశం కూడా పొందొచ్చు. ఇది భవిష్యత్తులో కచ్చితంగా మేలు చేస్తుంది.

Photo Stories