Skip to main content

రైల్వేల్లో జాబ్‌ చేయాలనుకుంటున్నాను. సంబంధిత నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుంది?

Question
రైల్వేల్లో జాబ్‌ చేయాలనుకుంటున్నాను. సంబంధిత నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుంది?
రైల్వే అవసరలకనుగుణంగా  వివిధ పోస్ట్‌ల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. ఈ నోటిఫికేషన్‌ను ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌, అన్ని ప్రముఖ జాతీయ, స్థానిక దినపత్రికల్లో ప్రచరురిస్తారు. దాంతోపాటు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌, సికింద్రాబాద్‌ వెబ్‌సైట్‌లో కూడా ఉంటుంది. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత దరఖాస్తు చేసుకోవడానికి నెల గడువు ఉంటుంది. పోస్ట్‌ల భర్తీ కోసం నిర్వహించే రాత పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కును తీసివేస్తారు. పోస్ట్‌లకు నిర్దేశించిన అర్హతననుసరించి రాత పరీక్షల సిలబస్‌ ఉంటుంది. జనరల్‌ నాలెడ్జ్‌/జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీపై  ప్రశ్నలుంటాయి. టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ పోస్ట్‌ల నియామకానికి వారి సబ్జెక్ట్‌కనుగుణంగా కూడా ప్రశ్నలుంటాయి. క్లర్క్స్‌, ప్రొబేషనరీ స్టేషన్‌ మాస్టర్స్‌, కమర్షియల్‌/ట్రాఫిక్‌ అప్రెంటెసిస్‌, జూనియర్‌ అకౌంట్స్‌ అసిస్టెంట్స్‌ వంటి పోస్టులకు నిర్వహించే రాత పరీక్ష ఇంగ్లిష్‌/హిందీలో కూడా ఉంటుంది. వెబ్‌సైట్‌: www.rrbsecunderabad.org

Photo Stories