Skip to main content

పేపర్‌-2ను ఏవిధంగా ప్రిపేర్‌ కావాలి?

Question
పేపర్‌-2ను ఏవిధంగా ప్రిపేర్‌ కావాలి?
 పేపర్‌-2 కూడా 200 మార్కులకు ఉంటుంది. ఫిజికల్‌ సైన్స్‌, కెమిస్ట్రీ అంశాల్లో ఉన్న సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ స్థాయిలోని ఫిజిక్స్‌ అంశాలు(లైట్‌, టైం అండ్‌ మాస్‌, స్ట్రెయిట్‌ లైన్‌ మోషన్‌, వెలాసిటీ అండ్‌ యాక్సిలరేషన్‌, న్యూటన్‌ లా ఆఫ్‌ మోషన్‌, వర్క్‌, ఎనర్జీ పవర్‌ తదితర)పై పట్టు సాధించాలి. ఇక కెమిస్ట్రీకి సంబంధించి ఫిజికల్‌ కెమిస్ట్రీలోని అటామిక్‌ స్ట్రక్చర్‌, కెమికల్‌ బాండింగ్‌, ఎనర్జీ ఛేంజెస్‌ ఇన్‌ కెమికల్‌ రియాక్షన్‌, సొల్యూషన్స్‌, ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఆక్సిడేషన్‌ రిడక్షన్‌, నేచురల్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ రేడియో యాక్టివిటీ అంశాలపై దృష్టి సారించాలి. ఇనార్గానిక్‌ కెమిస్ట్రీలోని గ్రూప్‌ ఎలిమెంట్స్‌తోపాటు మెటలర్జికల్‌ ప్రాసెస్‌లను తెలుసుకోవడం ప్రయోజనం. ఇక ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో హాలోజన్‌ డెరివేటివ్స్‌, హైడ్రాక్సీ కాంపౌండ్స్‌, ఈథర్స్‌, నైట్రో కాంపౌండ్స్‌ ఎమైన్స్‌ వంటి అంశాలను నేర్చుకోవాలి.

Photo Stories