Skip to main content

పేపర్‌ -1 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి?

Question
పేపర్‌ -1 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో ఎటువంటి ప్రశ్నలు ఉంటాయి?
పేపర్‌ -1 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌.. రెండు వందల మార్కులు కేటాయించారు. కాలవ్యవధి: 2 గంటలు. ఈ పరీక్షలో.. జనరల్‌ నాల్జెడ్‌, ఇంగ్లిష్‌, పర్సనాలిటీ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు.  జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించి బేసిక్‌ రూల్స్‌, గ్రామర్‌ కచ్చితంగా తెలిసుండాలి. ముఖ్యంగా వకాబ్యులరీ పెంచుకునే దిశగా కృషి చేయాలి. అంతేకాకుండా యాంటానిమ్స్‌, సినానిమ్స్‌, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెంన్సెస్‌ తదితర ప్రాథమిక అంశాలపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో హైస్కూల్‌ స్థాయి ఇంగ్లిష్‌ పుస్తకాలను చదివితే ప్రయోజనం ఉంటుంది.

 జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి ప్రముఖంగా పర్యావరణం, సమకాలీన అంశాలు, జీవులు- జాతులు, వృక్షాలు- రకాలు ఇలా.. సమాజం, పరిసరాల్లోని ఆయా అంశాలపై కనీస అవగాహన ఏ మేరకు ఉందనే విధంగా ప్రశ్నలు అడుగుతారు. అంతేకాక భారత చరిత్ర, స్వాంతంత్య్ర పోరాటంలోని ముఖ్య సంఘటనలు, రాజ్యాంగంపై కనీస అవగాహన పరీక్షించే ప్రశ్నలుంటాయి. హై స్కూల్‌, ఇంటర్మీడియెట్‌ స్థాయిలో సైన్స్‌, ఇంగ్లిష్‌, సోషల్‌ సబ్జెక్టు లపై పట్టున్న వారు సులభంగానే ఇందులో రాణించవచ్చు. ఇక ఈ పేపర్‌లోనే పార్ట్‌-బిగా నిర్వహించే పర్సనాలిటీ టెస్ట్‌లో అభ్యర్థి బేసిక్‌ ఇంటెలిజెన్స్‌, మెకానికల్‌ అప్టిట్యూడ్‌ను తెలుసుకునే రీతిలో ప్రశ్నలుంటాయి. కరెంట్‌ అఫైర్స్‌ సంబంధ ప్రశ్నలు కూడా ఉంటాయి. కాబట్టి పరీక్ష తేదీ నాటికి ముందు సంవత్సర కాలంలోని పరిణామాలను తేదీల వారీగా తెలుసుకోవడం మంచిది.

Photo Stories