నేను త్వరలో లా కోర్సు పూర్తిచేసుకొని న్యాయవాద కెరీర్ ప్రారంభించాలను కుంటున్నాను. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లాయర్‌గా రాణించేందుకు నేను...
- ఆర్.విక్రమ్, విశాఖపట్నం.
Question
నేను త్వరలో లా కోర్సు పూర్తిచేసుకొని న్యాయవాద కెరీర్ ప్రారంభించాలను కుంటున్నాను. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లాయర్‌గా రాణించేందుకు నేను ఎలాంటి సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుంటే మంచిదో వివరించండి?
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం లాయర్‌కు కంప్యూటర్, టెక్నాలజీపై అవగాహన ఉండటం తప్పనిసరిగా మారింది. సొంతంగా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించినా.. లేదా ఏదైనా పెద్ద లా సంస్థలో పనిచేస్తున్నా... బ్రౌజింగ్ దగ్గర నుంచి ఫైల్ షేరింగ్ వరకూ... న్యాయవాద వృత్తిలో ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్ లతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవడం కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లాయర్‌కు ఫైల్/డాక్యుమెంట్ తయారీకి ‘ఎంఎస్ ఆఫీస్’ను ఉపయోగించుకోవాలి. ఫైల్ షేరింగ్ కోసం ఒన్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్; కేస్‌మేనేజ్‌మెంట్ కోసం కాస్మోలెక్స్, ప్రాక్టీస్ పాంథర్, ఎవర్‌నోట్; వెస్ట్‌లా వంటి రీసెర్చ్ డేటాబేసెస్ వంటివి తెలుసుండటం వృత్తి పరంగా ఎంతో మేలు చేస్తుంది.