Skip to main content

క్లాట్ పరీక్ష, యూనివర్సిటీల వివరాలు తెలపండి?

-సుబ్రమణ్యం, కరీంనగర్.
Question
క్లాట్ పరీక్ష, యూనివర్సిటీల వివరాలు తెలపండి?
క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్).. ఇది దేశంలోని 17 ప్రఖ్యాతి పొందిన న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష.
  • బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.nls.ac.in
  • హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ లా (నల్సార్).
    వెబ్‌సైట్:
    www.nalsar.ac.in
  • భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.nliu.ac.in
  • కోల్‌కతాలోని వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యుడీషియల్ సెన్సైస్.
    వెబ్‌సైట్:
    www.nujs.edu
  • జోధ్‌పూర్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ
    వెబ్‌సైట్:
    www.nlujodhpur.ac.in
  • రాయ్‌పూర్‌లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.hnlu.ac.in
  • గాంధీనగర్‌లోని గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.gnlu.ac.in
  • లక్నోలోని డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.rmlnlu.ac.in
  • పంజాబ్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా.
    వెబ్‌సైట్:
    www.rgnul.ac.in
  • పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.cnlu.ac.in
  • కోచిలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్.
    వెబ్‌సైట్:
    www.nuals.ac.in
  • కటక్‌లోని నేషనల్ లా యూనివర్సిటీ ఒడిశా.
    వెబ్‌సైట్:
    www.nluo.ac.in
  • రాంచీలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా.
    వెబ్‌సైట్:
    www.nusrlranchi.ac.in
  • అసోంలోని నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ.
    వెబ్‌సైట్:
    www.nluassam.ac.in
  • విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.dsnlu.ac.in
  • తిరుచిరాపల్లిలోని తమిళనాడు నేషనల్ లా స్కూల్.
    వెబ్‌సైట్:
    www.tnnls.in
  • ముంబైలోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ.
    వెబ్‌సైట్:
    www.nlumumbai.edu.in
  • క్లాట్-2016కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. 2016, మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. 2016, మే 8న పరీక్ష ఉంటుంది.

అర్హత:
  • యూజీ ప్రోగ్రామ్స్: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2 (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం).
  • పీజీ ప్రోగ్రామ్స్: కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం).

పరీక్ష విధానం:
  • యూజీ ప్రోగ్రామ్స్: రెండు గంటల వ్యవధిలో 200 మార్కులకు సమాధానాలు గుర్తించాలి. ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెండ్ అఫైర్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, లీగల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్ వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
  • పీజీ ప్రోగ్రామ్స్: రెండు గంటల వ్యవధిలో 150 మార్కులకు సమాధానాలు గుర్తించాలి. కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యూరిస్ప్రుడెన్స్, లా ఆఫ్ కాంట్రాక్ట్స్, లా ఆఫ్ టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఫ్యామిలీ లా, ప్రాపర్టీ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా తదితర విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రవేశం: క్లాట్-2016 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి, మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.clat.ac.in

Photo Stories