కెరీర్‌లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి?
నైపుణ్యాలుంటే.. చక్కటి అవకాశాలు లభించే కోర్సు.. లా! గతంలో న్యాయ విద్య కోర్సులు అభ్యసించిన వారు కోర్టులకే పరిమితమయ్యే పరిస్థితి ఉండేది.
Question
కెరీర్‌లో న్యాయవాదిగా రాణించాలనుకుంటున్నాను.. నాకు అందుబాటులో ఉన్న కోర్సులు, ఉద్యోగ అవకాశాల గురించి తెలపండి?
కాని ఇప్పుడు కార్పొరేట్ రంగంలో సైతం లా గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్రపంచం విస్తరించాక ఈ కెరీర్‌కు మరింత ప్రాధాన్యం పెరిగింది. ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల విస్తరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు దేశంలో ముఖ్యమైన కేసులు వాదించేందుకు గంటల లెక్కన భారీ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చట్టాలపై పట్టు, వాదనాlపటిమ, చురుకుదనం ఉన్నవారికి లా చక్కటి కెరీర్.
ఇంటర్మీడియెట్/10+2తోనే దేశవ్యాప్తంగా లా స్కూల్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ప్రధానంగా బీఏ ఎల్‌ఎల్‌బీ/బీకామ్ ఎల్‌ఎల్‌బీ/ బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ/బీబీఏ ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ‘కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి. క్లాట్‌తోపాటు దేశంలో న్యాయవిద్యకు సంబంధించి ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లా స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్– ఇండియా(ఎల్‌శాట్–ఇండియా); టీఎస్‌లాసెట్/ఏపీలాసెట్ (తెలుగు రాష్ట్రాల్లో) వంటి ప్రవేశ పరీక్షలకు హాజరుకావచ్చు.
అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత పొస్టు గ్రాడ్యుయేషన్‌లో.. సివిల్/క్రిమినల్/ కార్పొరేట్/ఎన్విరాన్‌మెంటల్/కాన్‌స్టిట్యూషనల్/సైబర్/ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా/రియల్ ఎస్టేట్ లా/మీడియా లా/ఇంటర్నేషనల్/బిజినెస్ లా/ట్యాక్స్‌లా.. ఇలా పలు స్పెషలైజేషన్స్ చేయవచ్చు.