Skip to main content

ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా(ఆనర్స్) కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

మధు, మహబూబాబాద్.
Question
ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో బ్యాచిలర్ ఆఫ్ లా(ఆనర్స్) కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
  • ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సును అందిస్తోంది. ఈ ప్రోగ్రాంను బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా గుర్తించింది.
    ప్రవేశం: ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్/ ఎల్‌ఎస్‌ఏటీ ఇండియా/ఎల్‌ఎస్‌ఏటీ గ్లోబల్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.rgsoipl.iitkgp.ernet.in
  • హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలోని నల్సార్ ప్రాక్సిమేట్ ఎడ్యుకేషన్.. పేటెంట్ లాస్‌లో ఒకేడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది. ఇది వెబ్ అనుబంధ ప్రోగ్రాం.
    అర్హత: డిగ్రీ.
    వెబ్‌సైట్:  www.nalsarpro.org
  • ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ స్టడీస్.. పేటెంట్ లా అండ్ ప్రాక్టీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంను అందిస్తోంది.
    అర్హత: డిగ్రీ.
    ప్రవేశం: ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iips.nmims.edu
  • ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ ఐపీఆర్ అండ్ పేటెంట్ లాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: సైన్స్‌లోని ఏ విభాగంలోనైనా డిగ్రీ/పీజీ/ పీహెచ్‌డీలు చేసినవారు అర్హులు.
    వెబ్‌సైట్:  www.nludelhi.ac.in
  • బెంగళూరులోని నాగర్భవిలోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌లో దూరవిద్య ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    వెబ్‌సైట్:  www.nls.ac.in

Photo Stories