Skip to main content

క్లాట్ పరీక్ష వివరాలను తెలపండి?

శరణ్య, కోదాడ.
Question
క్లాట్ పరీక్ష వివరాలను తెలపండి?
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) పరీక్ష ద్వారా 14 నేషనల్ లా యూనివర్సిటీల్లో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

ఎల్‌ఎల్‌బీ:
అర్హత:
కనీసం 45 శాతం మార్కులతో 10+2/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
రాత పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో 200 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి. అవి.. ఇంగ్లిష్ (40 మార్కులు); జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్(50 మార్కులు); ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ (న్యూమరికల్ ఎబిలిటీ-20 మార్కులు); లీగల్ ఆప్ట్టిట్యూడ్ (50 మార్కులు); లాజికల్ రీజనింగ్ (40 మార్కులు).
ఎల్‌ఎల్‌ఎం:
అర్హత:
55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ/తత్సమానం.
రాత పరీక్ష విధానం: పరీక్ష డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్‌ల కలయికగా ఉంటుంది. డిస్క్రిప్టివ్ విభాగంలో నాలుగు ఎస్సే ప్రశ్నలు ఉంటాయి. వీటికి 25 చొప్పున కేటాయించిన 100 మార్కులు. ఆబ్జెక్టివ్ విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కేటాయించిన మార్కులు 50. సమయం: 2 గంటలు.

వివరాలకు:  www.clat.ac.in

Photo Stories