Skip to main content

లా కోర్సులను డిస్టెన్స్‌లో అందిస్తున్న సంస్థలేవి?

Question
లా కోర్సులను డిస్టెన్స్‌లో అందిస్తున్న సంస్థలేవి?
మన రాష్ట్రంలో లా కోర్సులను డిస్టెన్స్‌ విధానంలో ఆఫర్‌ చేస్తున్న విశ్వవిద్యాలయాలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, లేబర్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా, కార్పొ రేట్‌ అండ్‌ సెక్యూరిటీ లా స్పెషలైజేషన్లుగా ఎల్‌ఎల్‌ఎంను అందిస్తోంది.
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్‌.
వెబ్‌సైట్‌: www.anucde.com
కాకతీయ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌ ఎన్విరాన్‌  మెంటల్‌ లా ఆప్షన్‌గా ఎల్‌ఎల్‌ఎం, బీజీఎల్‌ను ఆఫర్‌ చేస్తోంది. వెబ్‌సైట్‌: www.sdlceku.ac.in
వీటితోపాటు మదురై కామరాజ్‌ యూనివర్సిటీ, డెరైక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ‘బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లా’ ను అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్‌: www.mkudde.org
అన్నామలై యూనివర్సిటీ, డెరైక్టర్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ అకడెమిక్‌ లా, బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లా, బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లాను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: http://annamalaiuniversity.ac.in/distance_edu.htm

Photo Stories