Skip to main content

లా కోర్సులను ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?

Question
లా కోర్సులను ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?
‘లా’ కు సంబంధించి ఐదేళ్ల, మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఐదేళ్ల లా కోర్సును ఆఫర్‌ చేస్తోన్న యూనివర్సిటీలు: నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌. అర్హత: 50 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: http://nalsarlawuniv.ac.in
యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌-స్కూల్‌ ఆఫ్‌ జస్టిస్‌
అర్హత: 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.unimysore.ac.in
అంబేద్కర్‌ లా యూనివర్సిటీ-తమిళనాడు.
అర్హత:45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమానం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.tndalu.org
మూడేళ్ల లా కోర్సును అందిస్తున్న యూనివ ర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్‌.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌. లాసెట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.osmania.ac.in
ఐఎల్‌ఎస్‌ లా కాలేజీ, పుణే. అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
వెబ్‌సైట్‌: www.isllaw.edu
యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌.
రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వెబ్‌సైట్‌: www.du.ac.in

Photo Stories