Skip to main content

కార్పొరేట్‌ లా కోర్సును ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?

Question
కార్పొరేట్‌ లా కోర్సును ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలేవి?
కార్పొరేట్‌ లా కు సంబంధించి వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ డిగ్రీకి అనుగుణంగా ఉండి, కెరీర్‌కు ఉపయోగపడే కోర్సును ఎంచుకోవడం మంచిది.
కార్పొరేట్‌ లా కోర్సును ఆఫర్‌ చేస్త్తున్న యూనివర్సిటీలు:
ఏఎస్‌సీఎల్‌ లా స్కూల్‌, పుణే డిప్లొమా ఇన్‌ కార్పొరేట్‌ లా కోర్సును దూరవిద్యా విధానంలో అందిస్త్తుంది. లా, కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్స్‌, మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కు కూడా ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది.
వెబ్‌సైట్‌: www.als.org.in
సింబయాసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ, పుణే: డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ లా అండ్‌ కార్పొరేట్‌ లా కోర్సును పార్ట్‌టైం విధానంలో అందిస్త్తుంది. 50 శాతం మార్కులతో మూడేళ్ల/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: www.symlaw.ac.in
నల్సార్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌: కార్పొరేట్‌ లా స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎం డిగ్రీని ఆఫర్‌ చేస్తోంది. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం ఉంటుంది. వెబ్‌సైట్‌: www.nalsar.ac.in

Photo Stories