Skip to main content

ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. తర్వాత ఎల్‌ఎల్‌ఎం లేదా ఎంబీఏ కోర్సుల్లో ఏదీ తీసుకుంటే మంచిది?

Question
ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. తర్వాత ఎల్‌ఎల్‌ఎం లేదా ఎంబీఏ కోర్సుల్లో ఏదీ తీసుకుంటే మంచిది?
ఏ కోర్సు ఎంచుకోవాలనేది మీ ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు కాబట్టి తర్వాత ఎల్‌ ఎల్‌ఎం చదవడం వుంచిది. బ్యాచిలర్‌ స్థాయిలో చదివిన సబ్జెక్టుపై ఉన్న అవగాహనతో మాస్టర్‌ స్థాయిలో మీరు తీసుకున్న స్పెషలైజేషన్‌కు న్యాయం చేకూర్చగలుగుతారు. న్యాయ రంగంలో విజయువంతమైన కెరీర్‌ నిర్మించుకోవటానికి కూడా ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్‌ విషయూనికొస్తే.. ఇది పూర్తిగా మీకు కొత్త రంగం. దాంతో ప్రతి అంశాన్ని మొదటి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోవాలి. అరుుతే అభిరుచి, ఆసక్తి కష్టపడే తత్వం, స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే ఎంబీఏలో రాణించవచ్చు.
ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తున్న సంస్థలు:
హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ రైట్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ లా, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ, కార్పొరేట్‌ లా అండ్‌ గవర్నెన్స్‌, ఇన్సూరెన్స్‌ లాస్‌, కాన్‌స్టిట్యూషనల్‌ లా అండ్‌ క్రిమినల్‌ లా స్పెషలైజేషన్లుగా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/బీఎల్‌ పూర్తి చేసిన వారు అర్హు లు. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్‌: www.nalsarlawuniv.ac.in
కొచ్చిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సెన్సైస్‌ అండ్‌ టెక్నాలజీ, స్కూల్‌ ఆఫ్‌ లీగల్‌ స్టడీస్‌ కూడా ఎల్‌ఎల్‌ఎం కోర్సును అందిస్తుంది. స్పెషలైజేషన్స్‌- అడ్మినిస్ట్రేటివ్‌ లా, కమ ర్షియల్‌ లా, కాన్‌స్టిట్యూషనల్‌ లా, కన్స్యుమర్‌ లా, క్రిమినల్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, హ్యూమన్‌ రైట్స్‌ లా, ఇంటిలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, లేబర్‌ లా, మారిటైమ్‌ లా. లా లో బ్యాచిలర్‌ డిగ్రీ చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్‌: http://sls.cusat.ac.in
బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ బిజినెస్‌ లా అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌ లా లో ఎల్‌ఎల్‌ఎం కోర్సు ఆఫర్‌ చేస్తుంది.కనీసం 50శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ చేసి ఉండాలి.  ఎంట్రెన్స్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు ఉంటాయి.
వెబ్‌సైట్‌: www.nls.ac.in
మహాత్మా గాంధీ యూనివర్సిటీ, స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ లీగల్‌ థాట్‌ - ఎల్‌ఎల్‌ఎం (హ్యూమన్‌ రైట్స్‌ లా, ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌, సైబర్‌ లా) కోర్సును ఆఫర్‌ చేస్తుంది. కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌ బీ పూర్తి చేసిన వారు అర్హులు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.mguniversity.edu

Photo Stories