Skip to main content

దక్షిణ భారతదేశంలో ఎల్‌ఎల్‌ఎం (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ)ని ఆఫర్‌ చేస్తున్న సంస్థలేవి?

Question
దక్షిణ భారతదేశంలో ఎల్‌ఎల్‌ఎం (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ)ని ఆఫర్‌ చేస్తున్న సంస్థలేవి?
నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా, హైదరాబాద్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎంను అందిస్తోంది. రెండేళ్ల ఈ కోర్సుకు 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ చేసినవారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఉంటుంది.
వెబ్‌సైట్‌:  www.nalsarlawuniv.ac.in
ఉస్మానియా యూనివర్సిటీ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ స్పెషలైజేషన్‌గా ఎల్‌ఎల్‌ఎంను ఆఫర్‌ చేస్తుంది. 45 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారు అర్హులు. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్‌ ఉంటుంది. వెబ్‌సైట్‌: www.osmania.ac.in
స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ లీగల్‌, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌ఎం(ఇంటలెక్చు వల్‌ ప్రాపర్టీ రైట్స్‌)ను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.mguniversity.edu
తమిళనాడులోని అంబేద్కర్‌ లా యూనివర్సిటీ మాస్టర్‌ ఆఫ్‌ లా (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌)ను ఆఫర్‌ చేస్తుంది.
వెబ్‌సైట్‌: www.tndalu.org

Photo Stories