ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పీజీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- నరేన్, తెనాలి.
Question
ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో పీజీ అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ వీఎల్‌ఎస్‌ఐలో ఎంఈ అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.uceou.edu
- విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.. ఎంబెడెడ్ సిస్టమ్స్ సబ్జెక్టుగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్పెషలైజేషన్‌ను అందిస్తోంది.
అర్హత:సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in/engg/
- హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ..ఎంబెడెడ్ సిస్టమ్స్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో స్పెషలైజేషన్స్‌తో ఎంటెక్ అందిస్తోంది.
అర్హత:సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్/ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.jntuh.ac.in/new/
- హైదరాబాద్‌లోని ఐఐఐటీ.. వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఎంటెక్ అందిస్తోంది.
అర్హత:కనీసం 68 క్రెడిట్ పాయింట్స్‌తో ఈసీఈతో బీఈ/బీటెక్.
ప్రవేశం: గేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(పీజీఈఈ)లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.iiit.ac.in