ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
Question
ఆర్కిటెక్చర్ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
భవనాల నిర్మాణంలో ఆర్కిటెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నేడు డిమాండ్‌కు తగిన ఆర్కిటెక్ట్స్‌ల లేకపోవడంతో ఈ కోర్సు చదివిన వారి ఉపాధి అవకాశాలకు ఎటువంటి ఢోకాలేదు.
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల తర్వాత పరిశోధనాంశంగా కూడా ఆర్కిటెక్చర్‌ను ఎంచుకోవచ్చు.
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల తర్వాత పరిశోధనాంశంగా కూడా ఆర్కిటెక్చర్‌ను ఎంచుకోవచ్చు.
ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ కోర్సులను అందిస్తోన్న సంస్థలు:
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ-హైదరాబాద్ బీ.ఆర్క్‌ను ఆఫర్ చేస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 (మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ -నాటా(NATA)లో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. అలాగే బీ.ప్లానింగ్ కోర్సును కూడా ఇదే వర్సిటీ అందిస్తోంది. ఎంసెట్ ఆధారంగా ఈ కోర్సులో అడ్మిషన్ లభిస్తుంది.
వెబ్‌సైట్: http://jnafau.ac.in
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్-న్యూఢిల్లీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సులను అందిస్తోంది. 50 శాతం మార్కులతో 10+2 (మ్యాథమెటిక్స్) పూర్తి చేసిన వారు అర్హులు. ఏఐఈఈఈలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.spa.ac.in
నాటా(NATA) స్కోర్ ఆధారంగానే అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్సిటీ బీ.ఆర్క్ (వెబ్‌సైట్: www.cept.ac.in), సర్ధార్ వల్ల్లభాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వాసద్, బీ.ఆర్క్(బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ స్పెలైజేషన్‌గా-వెబ్‌సైట్: www.svitasad.ac.in) లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మరిన్ని వివరాలకు www.nata.in చూడొచ్చు.