Skip to main content

సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో కరెంట్‌ అఫైర్స్‌ చాలా ముఖ్యమైన విభాగం. పరీక్షలు వాయిదా పడటంతో కొంతకాలంగా పత్రికలు సరిగా చదవలేదు. ఈ...

Question
సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో కరెంట్‌ అఫైర్స్‌ చాలా ముఖ్యమైన విభాగం. పరీక్షలు వాయిదా పడటంతో కొంతకాలంగా పత్రికలు సరిగా చదవలేదు. ఈ విభాగాన్ని ఎలా కవర్‌ చేయాలి?
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు ఒక నెల ముందు వరకు కరెంట్‌ అఫైర్స్‌ చదవడం మంచిది.  చాలా మంది 2019 జూన్‌ 1 నుంచి 2020 ఆగస్టు 1 వరకు కరెంట్‌ అఫైర్స్‌ను చదువుతారు. దీనికి అదనంగా సెప్టెంబర్‌ 1 వరకూ జరిగే అతి ముఖ్యమైన అంశాలపైనా దృష్టి పెట్టాలి. అలాగే కరెంట్‌ అఫైర్స్‌లో ప్రధానంగా 2020 జనవరి 1 నుంచి ఆగస్టు1 మధ్య సంభవించిన ప్రధానమైన అంశాలను బాగా గుర్తుంచుకోవాలి. న్యూస్‌ పేపర్లు చదవకపోయినా ప్రస్తుతం వివిధ న్యూస్‌ సైట్లలో ఆయా పత్రికల ఈపేపర్స్‌ అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పటి నుంచి పత్రికలు చదవడం ఆపేశారో అప్పటి నుంచి వర్తమాన విషయాలను నోట్స్‌ రాసుకోవచ్చు.

Photo Stories