Skip to main content

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా ప్రకటనతో నా ప్రిపరేషన్‌ దాదాపు ఆగిపోయింది. తిరిగి ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే ఈ రెండు నెలల సమయంలో...

Question
సివిల్స్‌ ప్రిలిమ్స్‌ వాయిదా ప్రకటనతో నా ప్రిపరేషన్‌ దాదాపు ఆగిపోయింది. తిరిగి ప్రిపరేషన్‌ ప్రారంభిస్తే ఈ రెండు నెలల సమయంలో పోటీలో నిలవగలనా?
ఇలాంటి అనుమానాలు ఉన్నవారు చేయాల్సిందల్లా.. ముందు మీరు ఎంత సబ్జెక్టు కవర్‌ చేశారో స్వయంగా అంచనా వేసుకోవాలి. అందుకోసం ప్రాక్టీస్‌ పేపర్లు ఆన్సర్‌ చేయడం; ఎన్ని ప్రశ్నలకు కచ్చితంగా(ఊహించకుండా) జవాబులు గుర్తించగలిగారో చూసుకోవడం వంటివి చేయాలి. ఈ స్వయం పరీక్షల్లో  స్కోరు 55 శాతం ఉంటే బాగా ప్రిపేర్‌ అవుతున్నట్టుగా అంచనా వేయవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సబ్జెక్టుల వారీగా కేటాయించి మరింత ఉత్సాహంతో చదవడం మేలు.

Photo Stories