Skip to main content

ఎస్‌బీఐ అసిస్టెంట్స్ క్లరికల్ కేడర్ పోస్టుల పరీక్షలో మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?

-సాయి రమ్య, సికింద్రాబాద్
Question
ఎస్‌బీఐ అసిస్టెంట్స్ క్లరికల్ కేడర్ పోస్టుల పరీక్షలో మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. ప్రొబేషనరీ, క్లరికల్ పరీక్షల్లో మాత్రమే ఉండే విభాగం.. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్. ఎస్‌బీఐ మినహాయించి మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాలకు నిర్వహించే ఐబీపీఎస్ పీవోస్, క్లరికల్ కేడర్ పరీక్షల్లో మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ విభాగమే లేదు. ప్రస్తుతం ఎస్‌బీఐ అసిస్టెంట్స్ క్లరికల్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుసుకుంటే ఈ విభాగంలో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. 

గత నెల 19, 20 తేదీల్లో జరిగిన ఆన్‌లైన్ పరీక్షలో అడిగిన ప్రశ్నలు: 
టార్గెట్ గ్రూప్ అంటే ఏమిటి?
సేవలు అందించడానికి, కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఎంచుకునే ప్రజా సమూహాన్ని టార్గెట్ గ్రూప్ అంటారు. ఉదా: ఉన్నతవిద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు విద్యా రుణాలు అందించడానికి బ్యాంకులు వీరిని టార్గెట్ గ్రూప్‌గా ఎంచుకుంటాయి. అదేవిధంగా పొదుపు ఖాతాల కోసం ఎవరికైతే బ్యాంకు అకౌంట్ లేదో వారందరినీ, కరెంట్ ఖాతాల కోసం వ్యాపార సంస్థలను టార్గెట్ గ్రూప్‌గా భావిస్తారు.

క్రాస్ సెల్లింగ్, అప్‌సెల్లింగ్ మధ్య తేడాలేంటి?
ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు అదనపు సేవలు అందించడం/ఉత్పత్తుల అమ్మకాన్ని క్రాస్ సెల్లింగ్ అంటారు. ఉదా: సేవింగ్ బ్యాంకు ఖాతా ఉన్నవారికి ఇంటి రుణం మంజూరు చేయడం లేదా కరెంట్ ఖాతా  ఉన్నవారికి బీమా పాలసీ అమ్మకం. ప్రస్తుతం ఉన్నదానికి అదనపు విలువ ను జోడించడాన్ని అప్‌సెల్లింగ్ అంటారు. ఉదాహ రణకు క్రెడిట్ కార్డ్‌పై రూ.25,000 పరిమితి ఉంటే.. దాన్ని రూ.40,000కు పెంచడం.

 పేటెంట్ రైట్స్ అంటే ఏమిటి?
వివిధ సంస్థలు, కంపెనీలు తమ లోగోలను, బ్రాండ్లను వేరేవారు వాడకుండా రిజిస్టర్ చేసుకుంటాయి. దీన్నే పేటెంట్ రైట్స్ అంటారు.

కో బ్రాండింగ్ అంటే ఏమిటి?
రెండు కంపెనీలు/సంస్థలు కలిసి మార్కెట్‌లో తమ అమ్మకాలను పెంచుకోవడానికి కలిసి పనిచేయడాన్ని కో బ్రాండింగ్ అంటారు. ఉదాహరణకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎక్కువ మంది ప్రజలు తమ బీమా పాలసీలు తీసుకొనేలా చేయడానికి స్టార్ యూనియన్ దైచీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. స్టార్ (బ్యాంక్ ఆఫ్ ఇండియా), యూనియన్ (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), దైచీ (జపనీస్ ఇన్సూరెన్స్ కంపెనీ).

Photo Stories