Skip to main content

పోటీ పరీక్షల కోసం చరిత్రలోని ‘బౌద్ధ శిల్పకళ’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?

- బి.కృష్ణచైతన్య, సైనిక్‌పురి, హైదరాబాద్.
Question
పోటీ పరీక్షల కోసం చరిత్రలోని ‘బౌద్ధ శిల్పకళ’ పాఠ్యభాగంలో ఏయే అంశాలను చదవాలి?
పోటీ పరీక్షల దృష్ట్యా ‘బౌద్ధ శిల్పకళ’ పాఠ్యభాగం కీలకమైంది. గతంలో నిర్వహించిన సివిల్స్ పరీక్షలో గాంధార, బౌద్ధశిల్పకళపై రెండు ప్రశ్నలు అడిగారు. అందువల్ల బుద్ధుడికి సంబంధించిన చారిత్రక అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. అజంతా గుహలు మొత్తం ఎన్ని ఉన్నాయి? వాటిలో ఏ గుహలో ఏముంది? రాజకుమారి మరణం, రెండో పులకేశి రాయబారికి దర్శనమిస్తున్నట్లు ఉన్న చిత్రాలు ఏయే గుహల్లో ఉన్నాయి? తదితర అంశాలపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కింది ఉదాహరణను గమనించండి.

అజంతా గుహల్లో బుద్ధుడు ధర్మాన్ని బోధిస్తున్నట్లుగా ఎన్నో గుహలో విగ్రహాన్ని తొలిచారు?
  1. 1
  2. 13
  3. 16
  4. 26

సమాధానం: 3.

అందువల్ల మిత్రవిందుని కథ, బోధిసత్వుడి గజావతారం తదితర జాతక కథల గురించి ఏయే గుహల్లో చెక్కారో తెలుసుకొని ఉండాలి. ఏయే ప్రాంతాల్లో బుద్ధుడికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు బయటపడ్డాయో గుర్తుంచుకోవాలి. అఫ్గానిస్తాన్‌లోని జలాలాబాద్, హడ్డా, బమియన్, కాబూలీ లోయలు; పాకిస్తాన్‌లోని చర్‌చద్ధ, తక్షశిల, స్వాత్ లోయ; భారత్‌లోని ఉష్కర, అర్వన్, పంజాబ్ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధ శిల్పకళకు చెందిన వివరాలను పట్టిక రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిపై జతపరచడానికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సంఘారామ అవశేషాలు-బయటపడి న ప్రదేశాలు, శిల్పకళ లక్షణాలు, వివిధ గు హల్లో ఉన్న చిత్రలేఖనం లాంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే ఎలాంటి ప్రశ్న ఇచ్చినా తేలిగ్గా సమాధానం గుర్తించవచ్చు.

Photo Stories