Skip to main content

పోటీ పరీక్షల కోసం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సబంధించి ఏయే అంశాలను ఎలా చదవాలో తెలపండి.

కె. ఊర్మిళ, నర్సాపూర్.
Question
పోటీ పరీక్షల కోసం భారతదేశ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులకు సబంధించి ఏయే అంశాలను ఎలా చదవాలో తెలపండి.
పోటీ పరీక్షల దృష్ట్యా ‘భారత దేశం - జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు’ పాఠ్యభాగం ప్రత్యేకమైంది. భారత దేశ భూగోళ శాస్త్రంలో మిగిలిన అంశాలు కింది తరగతుల నుంచి ఒకదానితో ఒకటి అనుబంధంగా ఉంటూ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి. కానీ ఇది భిన్నమైంది. ప్రతి పరీక్షలో దీని నుంచి 2, 3 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్‌‌వలు మొదలైనవి వందల సంఖ్యలో, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందువల్ల వీటిలో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి, వార్తల్లోకి వచ్చినవాటిని గుర్తించుకోవాలి. ఆయా ప్రదేశాలు, నదులు తదితర ప్రత్యేక అంశాల ఆధారంగా వీటికి పేర్లు పెట్టారు. ఇలాంటివాటిని బట్టి ఏయే రాష్ట్రాల్లో ఏయే సంరక్షణ కేంద్రాలున్నాయో గుర్తుంచుకోవాలి.

ఉదాహరణకు కింది ప్రశ్నను గమనించండి.
ఫారెస్ట్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
1) ఢిల్లీ
2) సిమ్లా
3) డెహ్రాడూన్
4) భోపాల్
సమాధానం: 3. దీంతోపాటు ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా డెహ్రాడూన్‌లోనే ఉన్నాయి. ఇలాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ప్రత్యేకంగా ఏ జీవుల సంరక్షణ కోసం ఏయే పార్కులు/రిజర్వులను ఏర్పాటు చేశారో టేబుల్ రూపంలో పొందుపరుచుకొని తరచూ పునశ్చరణ చేసుకోవాలి. ఈ విభాగం నుంచి ప్రశ్నలను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా మంచి మార్కులు సంపాదించవచ్చు.

Photo Stories