కాకతీయుల పాలనను ఎలా అధ్యయనం చేయాలో వివరించండి?
- గాజుల అభిరామ్, భువనగిరి
Question
కాకతీయుల పాలనను ఎలా అధ్యయనం చేయాలో వివరించండి?
నూతన తెలంగాణ రాష్ర్టంలో నిర్వహించబోయే ఏ పోటీ పరీక్షల్లో అయినా తెలంగాణ నేపథ్యంలోని అంశాలపై తప్పక ప్రశ్నలడుగుతారు. కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో కూడా ఈ అవకాశం ఉంది. సాంఘిక శాస్త్రంలోని చరిత్ర నుంచి ప్రధానంగా కాకతీయులు, కుతుబ్‌షాహీలు, రెడ్డిరాజులు, పద్మనాయకులు, అసఫ్‌జాహీ (నిజాం రాజులు)లు, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, హైదరాబాద్ రాష్ర్ట చరిత్ర, తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు ఇస్తారు. తెలంగాణ ప్రాంత కవులు, వారి రచనలు, వారిని ఆదరించిన రాజులు, వివిధ దేవాలయాలు నెలకొన్న ప్రాంతాలు - వాటిని నిర్మించిన రాజులు, అక్కడి శిల్పకళారీతుల గురించి ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.