Skip to main content

పోటీపరీక్షలకు సంబంధించి జనరల్ సైన్స్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?

- ఎన్.రాజేంద్రప్రసాద్, హైదరాబాద్.
Question
పోటీపరీక్షలకు సంబంధించి జనరల్ సైన్స్ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
జనరల్ సైన్స్‌లో ప్రధానంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటికి పొడిగింపు అంశాలైన స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), రోబో సాంకేతిక పరిజ్ఞానం, డిఫెన్స్ పరికరాలు వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.
  1. అంతరిక్ష ప్రయోగాలు, నౌకలు (పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్-3..), క్షిపణులు (బ్రహ్మోస్, అగ్ని..), ఆవిష్కరణలు, ఆవిష్కర్తలు; సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరులు తదితర అంశాలను తెలుసుకోవాలి.
  2. ఫిజిక్స్‌లో ధ్వని, ఉష్ణం, కాంతి, అయస్కాంతత్వం, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం; కెమిస్ట్రీలో ఆమ్లాలు-క్షారాలు, లోహాలు-మిశ్రమ లోహాలు, ముడి ఖనిజాలు, వాయువులు-సంఘటనం, రూపాంతరత, నీరు, కాలుష్యం; గాజు-రకాలు; సిమెంటు ముడిపదార్థాలు, రసాయనిక ఎరువులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
  3. బయాలజీలో ప్రధానంగా శరీరంలో కీలక అవయవాలు, వాటి పనితీరు; వ్యాధులు, కారణాలు, టీకాలు; విటమిన్లు, మొక్కలు, జంతువులు-ఉపయోగాలు; రక్త వర్గాలు; గ్రంథులు-హార్మోన్లు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి.
  4. గత ప్రశ్నపత్రాల ఆధారంగా, ఫ్యాకల్టీ సహాయంతో ప్రధానంగా దృష్టిసారించాల్సిన అంశాలను గుర్తించి, వాటిని చదవాలి. ముఖ్య భావనలు, దైనందిన జీవితంలో వాటి అనువర్తనాలను అధ్యయనం చేయడం ముఖ్యం. ప్రిపరేషన్‌కు పాఠశాల స్థాయి పాత పుస్తకాలను ఉపయోగించుకోవాలి.

Photo Stories