పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం - నీటి పారుదల వసతులు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి?
పి. కృష్ణప్రియ, కాజీపేట.
Question
పోటీ పరీక్షల కోసం ‘భారతదేశం - నీటి పారుదల వసతులు’ టాపిక్‌లో ఏయే అంశాలను చదవాలి?
ప్రతి పోటీ పరీక్షలో ఈ పాఠ్యభాగం నుంచి 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. భారతదేశంలో ఎక్కువ మంది ప్రజల జీవనాధారం వ్యవసాయం. దీనికి ప్రధానంగా నీటి సౌకర్యాలు కావాలి. వర్షపాతం రుతుపవనాలపై ఆధారపడి ఉండటం వల్ల భారతదేశమంతా నీటి పారుదల సౌకర్యాల్లో వ్యత్యాసాలున్నాయి. అందువల్ల ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నీటి పారుదల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వివిధ పంచవర్ష ప్రణాళికల్లోనూ దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల దృష్ట్యా ఈ పాఠ్యభాగం అత్యంత ప్రధానమైంది. నీటి పారుదల రకాలు, అవి ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాలువలు, వాటి ప్రత్యేకతలు మొదలైన అంశాలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. భారతదేశంలోని ప్రధానమైన నదులు, అవి ప్రవహించే రాష్ట్రాలపై ఆధారపడి సాగునీటి కాలువలు, ప్రాజెక్టులు నెలకొని ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు ఇలాంటి అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ఈ పాఠ్యభాగాన్ని చదివితే క్షుణ్నమైన అవగాహన ఏర్పరుచుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం 8, 9, 10వ తరగతి సాంఘికశాస్త్ర పుస్తకాలతో పాటు ఇంటర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.