పోటీ పరీక్షల కోసం బయాలజీ సబ్జెక్టును ఏవిధంగా చదవాలో కొన్ని సూచనలివ్వండి
వి.ప్రసన్నజ్యోతి, బాగ్‌లింగంపల్లి.
Question
పోటీ పరీక్షల కోసం బయాలజీ సబ్జెక్టును ఏవిధంగా చదవాలో కొన్ని సూచనలివ్వండి
సాధారణంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎక్కువగా పదోతరగతి స్థాయిలో, కొన్ని అంశాలపై ఇంటర్ స్థాయి వరకు వస్తున్నాయి. కాబట్టి ప్రిపరేషన్‌ను ఇంటర్మీడియెట్ స్థాయి వరకు కొనసాగించడం ప్రయోజనకరం. పదో తరగతి వరకు ఉండి, ఇంటర్‌లో పునరావృతమయ్యే పాఠ్యభాగాలను మాత్రమే చదవాలి.
- ప్రతి అంశాన్ని వివరంగా, విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకుంటూ చదవాలి.
- నిత్య జీవితంలో ఆయా అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి? అనే అంశాలను పరిశీలిస్తూ చదివితే ప్రయోజనకరంగా ఉంటుంది.
- కొన్ని అంశాలకు సంబంధించి సమాచారాన్ని పట్టిక రూపంలో రూపొందించుకుని తరచుగా మననం చేసుకుంటే ఆయా అంశాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
ఉదా: విటమిన్లు, ఎంజైమ్‌లు, వాటి ప్రభావం; మూలకాలు- వాటి లోపం వల్ల కలిగే - జీవశాస్త్రంలో ముఖ్యంగా వివిధ అంశాలకు సంబంధించిన చిత్ర పటాలను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తే విషయం సులువుగా అర్థమవుతుంది. వీటి సహాయంతో క్లిష్టంగా ఉండే అంశాలపై సులభంగా పట్టు సాధించవచ్చు.
- విధిగా నమూనా, గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. వీటి ద్వారా ప్రశ్నల సరళి తెలుసుకోవడమే కాకుండా పొరపాట్లను సరిచేసుకునే వెసులుబాటు లభిస్తుంది.