మానవ శరీరంలో ఉండే వివిధ రసాయనాలు, వాటి విధులపై పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.
ఎన్. వసంతలక్ష్మి,రామాయంపేట, మెదక్.
Question
మానవ శరీరంలో ఉండే వివిధ రసాయనాలు, వాటి విధులపై పోటీ పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలపండి.
మానవ శరీరం ఒక పెద్ద రసాయన కర్మాగారం. చర్మం, వెంట్రుకలు, గోళ్లు, మొదలైనవన్నీ ప్రోటీన్లతో నిర్మితమవుతాయి. కార్బొహైడ్రేట్లు, లిపిడ్లు శరీరానికి శక్తినిస్తాయి. పప్పుదినుసులు, మాంసం ద్వారా ప్రధానంగా ప్రోటీన్లు లభిస్తాయి. నూనెగింజల ద్వారా కొవ్వులు (లిపిడ్లు) లభిస్తాయి. కార్బోహైడ్రేట్లకు ప్రధాన వనరులు బియ్యం, గోధుమలు. పండ్లు, కూరగాయల నుంచి వివిధ విటమిన్లు లభిస్తాయి. వీటన్నింటితో కూడిన ఆహారాన్ని ‘సమతుల ఆహారం’ అంటారు. పోటీ పరీక్షల్లో ఈ అంశాలపై తరచుగా ప్రశ్నలు అడుగు తున్నారు. అందువల్ల జీవ వ్యవస్థలకు సంబంధించిన వివిధ రసాయన పదార్థాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. వీటి కోసం పదో తరగతి, ఇంటర్మీడియట్ ద్వితీ య సంవత్సరం రసాయనశాస్త్ర పుస్తకాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.