Skip to main content

గూప్-I స్థాయి పరీక్షల్లో ‘ప్రవాహిలు’ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి?

ఎన్. ప్రనీత, రాంనగర్.
Question
గూప్-I స్థాయి పరీక్షల్లో ‘ప్రవాహిలు’ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి?
పోటీ పరీక్షల్లో ‘ప్రవాహిలు’ టాపిక్ నుంచి తరచుగా 1 లేదా 2 ప్రశ్నలు అడుగుతున్నారు. సాధారణంగా గ్రూప్-ఐ, ఐఐ, సివిల్స్ ప్రిలిమ్స్ స్థాయి పరీక్షల్లో ఈ అంశంపై ప్రశ్నలు వస్తున్నాయి. ఫిజిక్స్‌లో ఇతర అంశాల కంటే ఇది కొంచెం భిన్నమైన అంశం. అయినప్పటికీ నిత్య జీవితంలో మనం గమనించే చాలా విషయాలు ఈ పాఠ్యభాగంతో ముడిపడి ఉండటం వల్ల తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. నీటిలో తేలియాడుతున్న, మునిగి ఉన్న, వేలాడుతున్న వస్తువులను గమనిస్తూ.. వాటి వెనుక ఉన్న ధర్మం లేదా సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ద్రవ్యరాశి, ఘన పరిమాణం, సాంద్రత లాంటి అంశాలు మధ్య సంబంధాలను తెలుసుకోవాలి. నిజ జీవితంలో జరిగే వివిధ సంఘటనలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ అంశంపై పట్టు సాధించవచ్చు. ఉదాహరణకు కింది అంశాన్ని పరిశీలించండి..
మంచి నీటిలో పెరిగే హైడ్రిల్లా (నాచు) మొక్క నీటిలో వేలాడుతుంది (కలిసిపోతుంది). కానీ అదే మొక్క సముద్రపు నీటిలో తేలుతుంది.

కారణం: ఏదైనా ఒక పదార్థ సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటే అది నీటిలో తేలుతుంది. ఎక్కువగా ఉంటే మునుగుతుంది. సరిగ్గా సమానంగా ఉంటే వేలాడుతుంది లేదా అందులో కలిసి పోతుంది. మంచినీటిలో పెరిగే హైడ్రిల్లా మొక్క దాని సాంద్రత నీటి సాంద్రతకు సమానంగా ఉండటం వల్ల ఆ నీటిలో వేలాడుతుంది. కానీ అదే మొక్క సముద్రపు నీటిలో తేలడానికి కారణం దాని సాంద్రత సముద్ర నీటి సాంద్రత కంటే తక్కువగా ఉండటమే. ఇలాంటి అంశాలను క్షుణ్నంగా అధ్య యనం చేయడం వల్ల ఈ టాపిక్‌పై తేలికగా పట్టు సాధించవచ్చు.

Photo Stories