టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల నేపథ్యంలో.. ఈ పరీక్షల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ పట్ల అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించారు.
ఈ పరీక్షలన్నీ మే నెలలో జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్ 18న అధికారులతో చర్చించారు. ఎంసెట్ భద్రత చర్యలపై జేఎన్‌టీయూహెచ్ అధికారులు, ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల నేపథ్యంలో భద్రతపై అధికారులు ఇప్పటికీ ఒక్క సమావేశం పెట్టుకోకపోవడాన్ని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది.
చదవండి: ఎంసెట్ | నీట్ | టిఎస్ పాలీసెట్ | లాసెట్ | ఐసెట్
గతంలో కనీ్వనర్‌గా ఉన్న గోవర్థన్ ఎప్పటికప్పుడు వివరాలు పారదర్శకంగా ఉంచేవారని, ప్రస్తుత కన్వీనర్ కొత్త కావడం వల్ల ఏమీ తెలియడం లేదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జేఎన్‌టీయూహెచ్ అధికారులు సహకరించడం లేదని ఈ సందర్భంగా లింబాద్రి మంత్రి వద్ద వాపోయినట్టు తెలిసింది.
Published date : 19 Apr 2023 02:43PM