Promotion Without Passing TET: టెట్ లేకుండానే పదోన్నతి కల్పించాలి
Sakshi Education
ములుగు రూరల్: ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేకుండానే పదోన్నతి కల్పించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు హట్కర్ సమ్మయ్య అన్నారు.
ఈ మేరకు ఏప్రిల్ 14న జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2010 సంవత్సరం కంటే ముందు ఉద్యోగంలో చేరిన వారిని టెట్ నుంచి మినహాయించాలన్నారు.
చదవండి: SLAS Exam: రేపు ఉపాధ్యాయులకు శ్లాస్ పరీక్ష..
టెట్ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు వివరణ ఇచ్చి గందరగోళాన్ని తొలగించాలన్నారు. ఇన్ సర్విస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడంతో పాటు ఉపాధ్యాయుల, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోరిక జయరాం, రఘురాం పాల్గొన్నారు.
Published date : 15 Apr 2024 01:18PM