Kapu Vinuthnna: ‘NLU’ ప్రవేశ పరీక్షల్లో ‘వినూత్న’ ప్రతిభ
Sakshi Education
అనంతపురం ఎడ్యుకేషన్: నేషనల్ లా యూనివర్సిటీల (ఎన్‌ఎల్‌యూ) ప్రవేశ పరీక్షలో అనంతపురానికి చెందిన కాపు వినూత్న జాతీయ స్థాయిలో సత్తా చాటింది.
లక్ష మందికి పైగా పోటీ పడిన ఈ పరీక్షలో దేశ స్థాయి జనరల్ విభాగంలో 470వ ర్యాంక్ సాధించింది. జనరల్ కేటగిరీలో మొత్తం 1,504 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జనరల్ కేటగిరీలో 30 ఖాళీలను భర్తీ చేయనుండగా వినూత్నకు రెండో ర్యాంకు దక్కింది. ఏపీ ఉమెన్ కేటగిరీలో 22 ఖాళీలను భర్తీ చేయనుండగా వినూత్న మొదటి స్థానంలో నిలిచింది.
చదవండి: First Deaf Lawyer Of India: దేశంలోనే తొలి బధిర మహిళా అడ్వకేట్‌గా సారా
డిసెంబర్ 3న నేషనల్ లా యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష జరిగింది. ఫలితాలు డిసెంబర్ 10న రాత్రి విడుదలయ్యాయి. వినూత్న తండ్రి కాపు విజయచంద్రారెడ్డి గతంలో డీసీసీబీ సీఈఓగా పని చేశారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఏపీ సీఓబీ సీఐటీలో ఫ్యాకల్టీగా పని చేస్తున్నారు. తల్లి కాపు మధురిమ గృహిణి.
- ఏపీ జనరల్ కేటగిరిలో రెండు, ఉమెన్ కేటగిరిలో ప్రథమస్థానం, దేశ స్థాయి జనరల్ కేటగిరీలో 470వ ర్యాంకు.
Published date : 13 Dec 2023 01:33PM