AP Eapcet: ఏపీ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలి: అపెక్మా
సంఘం సర్వసభ్య సమావేశం అక్టోబర్ 6న విజయవాడలో జరిగింది. అనంతరం వివిధ అంశాలతో సీఎం వైఎస్ జగన్ కి విన్నవిస్తూ రాసిన పత్రాన్ని మీడియాకు విడుదల చేశారు. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు ఇంజనీరింగ్ ప్రవేశాలను పూర్తిచేశాయని, ఏపీలో ఇంకా ప్రారంభం కానందున విద్యార్ధులు ఇతర కాలేజీలు, ప్రైవేట్ వర్సిటీల్లో చేరే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ.650 కోట్ల మొత్తాన్ని విడుదల చేయించాలని కోరారు. జగనన్న విద్యాదీవెన కింద 2020–21 బ్యాచ్ విద్యార్ధుల ఫీజులను విడుదల చేయాలని విన్నవించారు. కాగా ప్రైవేట్ వర్సిటీల సీట్ల వ్యవహారంలో కొంత జాప్యం జరుగుతుండటం వల్ల కూడా ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ఆటంకంగా మారినట్లు సమాచారం. ఈ వర్సిటీలు అక్టోబర్ 9వ తేదీ సాయంత్రం లోగా కోర్సుల వారీగా ఫీజులను నిర్ణయించేందుకు దరఖాస్తులను కమిషన్కు సమర్పించాల్సి ఉంది. వీటిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాకే కౌన్సెలింగ్‌లో చేర్చడానికి వీలవుతుంది. ఆ తరువాతే కౌన్సెలింగ్ చేపట్టి ఆయా సీట్లను విద్యార్థులకు కేటాయించగలుగుతారు.
చదవండి: