AP EAPCET 2024 Postponed: ఎలక్షన్స్ ఎఫెక్ట్.. ఏపీ ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పులు..
Sakshi Education
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్(ఏపీఈఏపీసెట్) పరీక్ష షెడ్యూల్ మారనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజున పోలింగ్ ఉండడంతో పరీక్ష వాయిదా వేయాలని భావిస్తున్నారు.
మే 15 నుంచి పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడిన సంగతి తెలిసిందే.
Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh | Telangana
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏపీఈఏపీసెట్ పరీక్షలను మే 13 నుంచి మే 19వ వరకు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేఫథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పులు చేసేందుకు ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో పాటు పీజీ సెట్ పరీక్ష తేదీల్లోనూ మార్పులు చేయనున్నారు.
College Predictor - 2023 AP EAPCET | TS EAMCET
Published date : 20 Mar 2024 06:20PM