Engineering: క్లాసులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. అధికారికంగా క్లాసులు మొదలైనా.. తొలిరోజు పరిచయ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ సారి కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి కోర్సుల్లో విద్యార్థుల ఎక్కువగా చేరారు. ఈ కోర్సుల విద్యార్థుల విద్యార్థులు తొలిరోజు హడావుడి చేసే అవకాశం కని్పస్తోందని కాలేజీల నిర్వా హకులు అంటున్నారు. రాష్ట్రంలో 175 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా కలిపి 76వేల సీట్ల వరకు భర్తీ అయ్యాయి. కాగా, దాదాపు రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్ విద్యాబోధన అరకొరగా సాగింది. ఆన్ లైన్ బోధనతో కాలేజీకి వెళ్లింది తక్కువే. ఇంతకాలం ఇంటి వాతావరణానికి విద్యార్థులు అలవాటుపడ్డారు. వీరందరినీ క్లాసుల మూడ్‌లోకి తెచ్చే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అన్ని కాలేజీలో దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆ తర్వాతే బోధనలోకి వెళ్తామని కాలేజీ యాజమాన్యాలూ పేర్కొంటున్నాయి. డిసెంబర్ 15 నుంచి క్లాసులు సీరియస్‌గా జరిగే వీలుందని జేఎన్ టీయూహెచ్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
చదవండి:
Artificial Intelligence: మెలార్డ్!.. కోర్టుల్లోకి కృత్రిమ మేధ